Saturday, November 8, 2014

ఉత్తరాంధ్రలో రీ షెడ్యూల్‌ రుణాలపై ఏడాదిపాటు మారటోరియం

హైదరాబాద్‌, నవంబర్‌8; తుఫాన్‌ బాధిత ఉత్తరాంధ్రకు చేయూతకోసం బ్యాంకులు ముందుకొచ్చాయి.. ఇందుకు సంబంధించిన  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జారీచేసిన మార్గదర్శకాలపై హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో చర్చించారు. వీటిని బ్యాంకులన్నీ అమలు చేయాలని ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ దొరైస్వామి, ప్రెసిడెంట్‌ సీపీఆర్‌ రాజేంద్రన్‌, బ్యాంకు కంట్రోలింగ్‌ అధికారులకు చెప్పారు. ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు రుణాల రీషెడ్యూల్‌ సర్వసాధారణం కాగా, ప్రస్తుతం పరిశ్రమలకూ ఆర్థిక సహకారం అందించాలని  రిజర్వు  బ్యాంక్ నిర్దేశించడం విశేషం. దీని ప్రకారం.. అర్హతనుబట్టి కొత్త రుణాలు కూడా ఇస్తారు. ఇక ఏడాది మారటోరియం తర్వాత.. 3, 5, 7 సంవత్సరాల వరకు రైతులు బకాయిలు చెల్లించేలా కొన్ని విధానాలను బట్టి వెసులుబాటు కల్పిస్తారు. రైతులకు వర్తింపజేసే విఽధానాన్నే డ్వాక్రా బృందాలకూ అన్వయిస్తారు. ఆర్బీఐ ఆదేశాలను బ్యాంకర్లు వచ్చే ఏడాది జనవరి 12లోగా అమలు చేయాలని దొరైస్వామి తెలిపారు. జాబితా ఇచ్చే సమయంలో నష్టం 50 శాతం కంటే ఎక్కువని వారు ధ్రువీకరించాల్సి ఉంటుంద ని రాజేంద్రన్‌ అన్నారు. వ్యవసాయ రుణాలపై ఏపీ ప్రభుత్వం ఆధార్‌నూ అనుసంధానించాలని బ్యాంకులకు చెప్పారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...