Friday, November 7, 2014

టి. అసెంబ్లీ నుంచి దేశం సభ్యుల సస్పెన్షన్...



హైదరాబాద్‌, నవంబర్‌ 7 : తెలంగాణ అసెంబ్లీ నుంచి పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రతిపాదించారు. దీంతో స్పీకర్‌ మధుసూదనాచారి పది మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి, సండ్ర, సాయన్న, ప్రకాష్‌గౌడ్‌, రాజేందర్‌రెడ్డి, మంచిరెడ్డి, అరికపూడి గాంధీ, కృష్ణారావు, మాగంటి గోపీనాథ్‌ సస్పెండ్‌ అయిన వారిలో ఉన్నారు. సభలో అనేక సార్లు గందరగోళ పరిస్థితులు నెలకొన్నపడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాట్లాడుతూ అన్ని సమస్యలపైనా మాట్లాడదామని అన్నారు. 

అంతకుముందు తెలుగుదేశం సభ్యుడు ఎర్రబెల్లి రైతుల ఆత్మహత్యలను ప్రస్తావిస్తూ మంత్రి పోచారం రైతు ఆత్మహత్యలపై హేళనగా మాట్లాడారని, అందుకు ఆయనను సభకు పిలిపించి క్షమాపణ చెప్పించాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత బడ్జెట్‌పైన చర్చిద్దామని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణాలో 370 మంది రైతులు మరణించారని, గజ్వేల్‌లో అత్యధిక సంఖ్యలో మృతి చెందారని ఆయన గుర్తు చేశారు. రైతు సమస్యల పైనా, కరెంటు సంక్షోభంపైనా చర్చించాల్సిందేనని ఆయన అన్నారు. తెలుగుదేశం సభ్యులు ఆయనకు మద్దతుగా నిలిచారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపడు బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపిన విషయాన్ని మర్చిపోయారా అని మంత్రి హరాష్‌రావు వ్యాఖ్యానించారు. దాంతో సభలో మరింత గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం సభ నిర్వహించాలనుకుంది, ప్రతిపక్షం మాత్రం సభను అడ్డుకోవడానికి వచ్చిందని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారని ఆయన అన్నారు.  


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...