కేంద్ర మాజీ మంత్రి కాశీరాం రాణా కన్నుమూత
న్యూఢిల్లీ,ఆగస్ట్ 31: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత కాశీరాం రాణా (76) శుక్రవారమిక్కడ అనారోగ్యంతో మృతిచెందారు. ఉదయం ఛాతీ నొప్పి రావడంతో ఆయనను స్థానిక జివేరాజ్ మెహతా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అక్కడే చనిపోయారు. రాణా సూరత్ నుంచి ఆరుసార్లు వరుసగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజపేయి ప్రభుత్వంలో (1998-2004) జౌళి, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం ఆయ్యాక రాణా ప్రాధాన్యం కోల్పోయారు. గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్ స్థాపించిన గుజరాత్ పరివర్తన్ పార్టీలో ఆయన ఇటీవలే చేరి ఎన్నికల ప్రచారం చేశారు.