సెమీఫైనల్స్ కు చేరిన సైనా
లండన్,ఆగస్ట్ 2: ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగోసీడ్ సైనా నెహ్వాల్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో సెమీఫైనల్స్ కు చేరి పతకానికి చేరువైంది. వెంబ్లీ ఎరెనాలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో సైనా 21-15, 22-20 తో వరల్డ్ ఏడో ర్యాంకర్, ఏడోసీడ్ టిన్ బాన్ (డెన్మార్క్) పై విజయం సాధించింది. నాలుగేళ్ల కిందట బీజింగ్ గేంస్ లో క్వార్టర్స్ లోనే వెనుదిరిగిన సైనా ఈసారి మాత్రం ఆ అడ్డంకిని సునాయాసంగానే దాటింది. శుక్రవారం జరిగే సెమీ పైనల్స్ లో సైనా... వరల్డ్ నంబర్‌వన్ యిహాన్ వాంగ్ (చైనా) తో తలపడుతుంది. గతంలో ఈ ప్రత్యర్థితో ఐదుసార్లు తలపడిన సైనా ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు. కొండంత ఆత్మవిశ్వాసంతో ఉన్న సైనా ఈసారి వాంగ్‌ను దెబ్బకొట్టాలని... పతకాన్ని ఖాయం చేసుకోవాలని భారత్ ఆత్రుతగా ఎదురుచూస్తోంది.
Comments