మొదటి టెస్ట్ లో భారత్ ఘన విజయం
హైదరాబాద్, ఆగస్ట్ 26:: న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. కివీస్ ను ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో ఓడించింది. ఫాలో ఆన్ ఆడిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 164 పరుగులకు ఆలౌటయింది. మెక్ కల్లమ్ (52), విలియమ్సన్ (42) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు నేల కూల్చాడు. ఓజా మూడు వికెట్లు పడగొట్టాడు. యాదవ్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 438 పరుగులు, కివీస్ 159 పరుగులు చేసింది. అశ్విన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో రెండు టెస్ట్ ల సిరీస్ లో ధోనీ సేన 1-0 ఆధిక్యం సాధించింది. రెండో టెస్ట్ బెంగళూరులో ఈనెల 31న ప్రారంభమవుతుంది.
Comments