త్వరలో అన్నా రాజకీయ పార్టీ...
న్యూఢిల్లీ, ఆగస్ట్ 3: ప్రముఖ సామాజిక కార్యకర్త, జనలోక్ పాల్ బిల్లు ఉద్యమ నేత అన్నా హజారే జంతర్ మంతర్ వద్ద శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తన దీక్ష విరమించారు. రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. లోక్ పాల్ బిల్లు ప్రవేశపెడితే తాను రాజకీయాలకు స్వస్తి చెబుతానన్నారు. తాము పెట్టే రాజకీయ పార్టీ ప్రజల పార్టీ అన్నారు. పార్టీకి అధిష్టానం అంటూ ఏమీ ఉండదని చెప్పారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటుందన్నారు. తాను ఎన్నికలలో పాల్గొనని చెప్పారు. అవినీతిలో పోరుపై తాను యువత వెంటే ఉంటానని అన్నా ప్రకటించారు.
Comments