నేడు అరుదైన పున్నమి రాత్రి...
వాషింగ్టన్: ఒకే నెలలో రెండు పర్యాయాలు చంద్రదర్శనమైతే అదీ పూర్ణచంద్రుడు దర్శనమిస్తే 'బ్లూమూన్' అంటారు. ఇది అరుదుగా జరిగే సంఘటన. ఈనెలలో 2వ తేదీన పున్నమి వచ్చిన సంగతి తెలిసిందే. మరో సారి ఆగస్టు 31న అంటే ఈ శుక్రవారం రాత్రి అరుదైన పున్నమి చంద్రుడు
కనిపించనున్నాడు. ఇది ఆగస్టు నెలలో రెండో పున్నమి కావడం విశేషం. భారతీయ
కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7.28 గంటలకు ఆకాశంలో నిండు పున్నమి
చంద్రుడు దర్శనమిస్తాడని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది. మళ్లీ మూడేళ్ల తర్వాత, 2015 జూలై 31న ఇలాంటి అరుదైన ‘బ్లూమూన్’ దర్శనమివ్వనున్నాడు. దాదాపు ప్రతి రెండున్నరేళ్లకు ఒకసారి ఇలా అరుదుగా ఒకే నెలలో రెండు పున్నములు వస్తాయని తెలిపింది..

Comments