ఫీజు రీయింబర్స్ మెంట్ సక్రమ అమలుకై విజయమ్మ దీక్ష
హైదరాబాద్, ఆగస్ట్ 13: అర్హులైన పేద విద్యార్థులందరికీ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమల్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం ఏలూరులో దీక్ష చేపట్టారు. అర్హులందరికీ పథకం అమలును యథావిధిగా కొనసాగించాలనే డిమాండ్‌తో ఆమె రెండు రోజుల పాటు ఈ దీక్షను కొనసాగించనున్నారు. అంతకు ముందు దీక్ష స్థలికి చేరుకున్న ఆమెకు విద్యార్థులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
Comments