శ్రీలంకపై ట్వంటీ 20 కూడా మనదే...
పల్లెకలె, ఆగస్ట్ 7: శ్రీలంకతో జరిగిన ఏకైక ట్వంటీ 20 మ్యాచ్‌లో భారత్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 156 పరుగుల లక్ష్యాన్ని లంకేయుల ముందుంచింది. ధాటిగా బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంకను భారత్ బౌలర్లు కట్టడి చేశారు. ఇర్ఫాన్ పఠాన్ మూడు, దిండా నాలుగు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్, అశ్విన్‌లకు తలో వికెట్టు లభించింది. శ్రీలంకను 118 పరుగులకే కట్టడి చేయడంతో విజయం భారత్ పక్షాన నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. కోహ్లీ (68) అర్థ సెంచరీతో రాణించాడు. రైనా 34, రహానే 21, ధోనీ 16, గంభీర్ 6 పరుగులు చేశారు. లంక బౌలర్లలో ఈరంగ రెండు వికెట్లు పడగొట్టాడు. మెండిస్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఇప్పటికే వన్డే సిరీస్ లో శ్రీలంక పై భారత్ 4-1 తేడాతో గెలిచింది.
Comments