ఓజాకు 4 వికెట్లు: తొలిరోజు న్యూజిలాండ్ 328/6
బెంగుళూరు, ఆగస్ట్ 31: బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో శుక్రవారం మొదలైన రెండవ టెస్టులో న్యూజిలాండ్ మొదటి రోజున 81.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కెప్టెన్ రాస్ టేలర్ సెంచరీ (113) చేశాడు. బారత స్పిన్నర్ ఓజా 4 వికెట్లు తీసుకోగా.. రవిచంద్రన్ అశ్విన్, జహీర్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.వాతావరణం సరిగా లేక పోవడంతో మొదటి రోజున 8.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను నిలిపి వేశారు. ఈ సమయాన్ని కవర్ చేసేందుకు గాను శనివారం అరగంట ముందు (ఉదయం 9 గంటలకు) ఆటను ప్రారంభించనున్నారు. రెండు టెస్టు ల సిరిస్‌లో ఇప్పటికే టీమిండియా తొలి టెస్టుని కైవసం చేసుకోని 1-0తో ఆధిక్యంలో ఉంది.
Comments