మాయా కొద్నానికి 28 ఏళ్ల జైలు శిక్ష ...
అహ్మదాబాద్ , ఆగస్ట్ 31: నరోదా పాటియా అల్లర్ల కేసులో గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీకి చెందిన నరోదా ఎమ్మెల్యే మాయా కొద్నానికి స్థానిక ప్రత్యేక కోర్టు 28 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో 32 మంది దోషులుగా తేలిన విషయం తెలిసిందే. 29 మంది దోషులకు జీవితకాల శిక్ష విధించింది. భజరంగదళ్ నాయకుడు బాబు భజరంగికి కోర్టు జీవితకాల శిక్ష విధించింది. 2002 ఫిబ్రవరిలో గోధ్రా రైలు దహనం జరిగిన మర్నాడు నరోదా పాటియా ప్రాంతంలో చెలరేగిన అల్లర్లలో 97 మంది ముస్లింలు మృతి చెందారు.
Comments