బాలీవుడ్ వెటరన్ హంగల్ కన్నుమూత
ముంబై, 26:: బాలీవుడ్ సినీనటుడు ఎకె హంగల్ (95) కన్నుమూశారు. 200లకు పైగా సినిమాలలో ఆయన నటించారు. పరిచయ్, షోలే సినిమాలో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. 2011 లో ఆర్దిక సమస్యతో ఇబ్బంది పడిన హంగల్ ను మెగా హీరోలు అమితాబచ్చన్, అమీర్ ఖాన్ ఆదుకున్నారు. గత మే నెలలో వచ్చిన మధుబాల టివి షో హంగల్ కు చివరిది. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు.

Comments