వర్మ డిపార్టమెంట్ లో లక్ష్మీ ప్రసన్న!
మంచు లక్ష్మీ ప్రసన్న నటించిన రామ్ గోపాల్ వర్మ సినిమా ' దొంగలముఠా ' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుని తీసినన్ని తీసినని రోజులు కూడా ఆడకుండానే అయినా వర్మాజీ కి అమె పై కాంఫిదెన్స్ పోలేనట్టే ఉంది. ఆమెకు నటిగా లైఫ్ ఇవ్వాలని కంకణం కట్టుకున్న రామ్ గోపాల్ వర్మ ఆమెను ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ కే కి పరిచయం చేయబోతున్నాడు. ఆయన తాజా చిత్రం ' డిపార్టమెంట్ ' తో ఆమెను బాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిపార్టమెంట్ లో రానా హీరోగా నటిస్తున్నాడు. అమితాబ్,సంజయ్ దత్ నటిస్తున్న ఈ చిత్రం పోలీస్ డిపార్టమెంట్ నేపధ్యంలో జరుగుతుంది. కాగా లక్ష్మీ మంచు కూడా ఈ న్యూస్ కన్పర్మ్ చేసింది. ..ఓ బాలీవుడ్ చిత్రానికి సైన్ చేసాను. సూపర్ గా ధ్రిల్ అయ్యాను. వివరాలు త్వరలో చెపుతాను.నా కలలు అతి త్వరలో నిజం కాబోతున్నాయి... అని ట్విట్జర్ లో రాసింది. అయితే అది వర్మ ప్రాజెక్టు అని మాత్రం ఆమె రివిల్ చేయక పోవడం గమనార్హం. ఇంతకుముందు కూడా ఆమె క్రిష్ 3లో చేయబోతోందని, రాకేష్ రోషన్ పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారని చెప్పుకొచ్చారు....