దిక్కుమాలిన ప్రభుత్వం...సినిమా టిక్కెట్ల ధరనూ పెంచేసింది.
హైదరాబాద్,జులై 11: అన్ని ధరలూ పెరిగిపోయి జీవనం భారమై పోయిన పరిస్థితుల్లో రిలాక్స్ కోసం సినిమాకు వెడదామనుకునే వారికి ఆ సంతోషం కూడా మిగల్చలేదు దిక్కుమాలిన ప్రభుత్వం. కొందరు బడా నిర్మాతల లాబీయింగ్ కు తలొగ్గి సినిమా టిక్కెట్ల ధరలను పెంచి పారేసింది. మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలో ఎసి ధియేటర్ల టిక్కెట్ ధరను 50 రూపాయల నుంచి 60 రూపాయలకు పెంచారు. సాధారణ టిక్కెట్ ధరను 25 నుంచి 30 రూపాయలకు పెంచారు. ఇతర ప్రాంతాలలో ఎసి టిక్కెట్ ధరను 30 రూపాయల నుంచి 40 రూపాయలకు పెంచారు. సాధారణ టిక్కెట్ ధరను 20 నుంచి 25 రూపాయలకు పెంచారు.
Comments