డ్రగ్స్ కేసులో హీరో వరుణ్ సందేశ్...!
హైదరాబాద్,జులై 23: హ్యాపీ డేస్ హీరో వరుణ్ సందేశ్ డ్రగ్స్ కేసులో ఇరుకున్నారు. ఆయనతో పాటు మరో యువహీరో అభిషేక్ కూడా ఈ కేసులో ఇరుక్కున్నాడు. హైదరాబాద్ పశ్చిమ మండలం పోలీసులు శుక్రవారం నాడు లంగర్‌హౌస్‌లో జూనియర్ ఆర్టిస్టు నాగసిద్ధార్థతో పాటు నైజీరియన్ ఫ్రెడరిక్‌ను కొకైన్‌తో పట్టుకున్నారు. వారిద్దరినీ పోలీసులు విచారించారు. నాగసిద్ధార్థ బెంగుళూర్‌లోని నారాయణ హృదయాలయలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్రెడరిక్ క్రిమినాలజీలో డాక్టరేట్ చేశాడు. వారి నుంచి 50 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటరాగేషన్లో నాగసిద్ధార్థ తాను వరుణ్ సందేశ్, అభిషేక్, నిర్మాత ఉప్పలపాటి రవితో పాటు మరి కొంత మంది సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఫ్రెడరిక్, నాగసిద్ధార్థ హైదరాబాదు నగరానికి 250 గ్రాముల కొకైన్ తెచ్చినట్లు తెలుస్తోంది. సిద్ధార్థ కాల్ లెటర్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, సిద్ధార్థ తనకు తెలుసునని అయితే అంత సాన్నిహిత్యం లేదని మీడియాకు చెప్పిన వరుణ్ సందేశ్ అవసరమైతే వైద్య పరీక్షలకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఫ్రెడరిక్ వద్ద మీ ఫోన్ నెంబర్ ఎలా ఉందని అడిగితే తన ఫోన్ నెంబర్ చాలా మంది వద్ద ఉందని తాను చేసేది ఏమీలేదని వరుణ్ సమాధానమిచ్చారు.
Comments