బాలీవుడ్ ఆఫర్ వచ్చినా ...
అల్లు అర్జున్ కి బాలీవుడ్ ఆఫర్ వచినట్టు భోగట్టా. హిందీలో పేరున్న యాష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ నుంచి అర్జున్ కు ఆఫర్ వచ్చినట్లుగా వినపడుతోంది. అయితే ఇది కన్ఫర్మ్ కాకపోయినా ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో సౌత్ హీరో అవసరమై అల్లు అర్జున్ ని పిలిచి మాట్లాడటం జరిగిందని చెప్తున్నారు. కాగా, ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ మార్కెట్ కు పరిచయమయ్యే అవకాశమున్నా డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక అల్లు అర్జున్ నో చెప్పే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. తాజా చిత్రం బద్రీనాధ్ ఫెయిల్యూర్ కావటంతో అర్జున్ అర్జంటుగా తెలుగు లో ఒక హిట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అతని డాడీ అల్లు అరవింద్ అభిప్రాయపడుతున్నారుట. . ఇక సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి అల్లు అర్జున్ మరో చిత్రం ప్రారంభం కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తారు. చిత్రానికి' హనీ 'అనే టైటిల్ వినపడుతోంది.

Comments