రెండు వారాల్లో తెలంగాణ పై ప్రకటన: కెసిఆర్ ధీమా
హైదరాబాద్,జులై 14: రెండు వారాల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసు కండువా వేసుకుని గురువారం కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల దీక్షా శిబిరంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. రెండు వారాల్లో తెలంగాణ పై ప్రకటన వెలువడుతుందని తనకు ఢిల్లీ నుంచి సమాచారం ఉందని ఆయన చెప్పారు. ధర్మమే గెలుస్తుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధుల రాజీనామాలను, దీక్షను ఆయన కొనియాడారు. కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలు చరిత్రలో నిలిచిపోతాయని ఆయన అన్నారు.
Comments