వింబుల్డన్‌లో కొత్త చాంపియన్ నొవాక్ జొకోవిచ్
లండన్,జులై 4: టాప్‌సీడ్ రాఫెల్ నాదల్‌ను రఫ్ ఆడించి సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ తన చిన్ననాటి కలను సాకారం చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల తర్వాత వింబుల్డన్‌లో కొత్త చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6-4, 6-1, 1-6, 6-3తో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. సోమవారం విడుదల చేసే ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో అధికారికంగా ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంక్ హోదాను దక్కించుకోనున్న జొకోవిచ్‌కు ఇది తొలి వింబుల్డన్ టైటిల్. ఓవరాల్ కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. గతంలో అతను ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను రెండుసార్లు (2008, 2011లో) కైవసం చేసుకున్నాడు.

Comments