నాగం వర్గం రాజీనామా
హైదరాబాద్,జులై 3: తెలంగాణ కోసం పోరాడే వారిమథ్య ఐక్యతను కోరుతూ ఇందిరా పార్కు వద్ద రెండు రోజుల దీక్షను చేపట్టిన ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి తో పాటు ఆయనకు మద్దతు తెలిపిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ మేరకు జనార్ధన రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు వేణుగోపాల చారి, హరీశ్వర రెడ్డి, జోగు రామన్నలు రాజీనామా లేఖలపై సంతకాలు చేశారు. ఆ లేఖలను శాసనసభ ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్కకు పంపారు.ఇందిరా పార్కు వద్ద ఆచార్య జయశంకర్ ప్రాంగణంలో ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి ఆదివారం ఉదయం 10 గంటలకు ఐక్యత దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, మాజీ మంత్రి బోడ జనార్ధన్, సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు, విమలక్క, వసంత రెడ్డి పాల్గొన్నారు.
Comments