విజయవంతంగా జిశాట్ -12 ప్రయోగం
నెల్లూరు,జులై 15: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోటనుంచి శుక్రవారం సాయంత్రం 4.48 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ-సి 17 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. 1410 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహం జీశాట్-12ను ఇది నింగిలోకి మోసుకెళ్లింది. జీశాట్-12 ఎనిమిదేళ్లపాటు సేవలు అందించనుంది. రూ. 200 కోట్లతో ఈ ప్రయోగాన్ని షార్ చేపట్టింది. జీశాట్ -12 నిర్దిష్ట కక్ష్యలోకి చేరుకున్నట్లు ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రజ్ఞుల్లో ఆనందం అంబరాన్ని అంటింది. జిశాట్ -12 ఉపగ్రహం వల్ల సమాచార వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. ఈ ఉపగ్రహాన్ని విద్య, టెలిఫోన్, టెలిమెడిసిన్ సర్వీసులకు వినియోగిస్తారు.

Comments