తెలంగాణపై ఒత్తిళ్ళు పనిచేయవు: ఏఐసిసి
న్యూఢిల్లీ,జులై 18: తెలంగాణ అంశం భావోద్వేగాలకు సంబంధించినదని ఏఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారి అన్నారు. అందరూ సహనం వహించాలని ఆయన సూచించారు. ప్రాంతీయ ఒత్తిళ్ల వల్ల జాతీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందన్నారు. గుర్ఖాలాండుకు, తెలంగాణకు సంబంధం లేదన్నారు. ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. తెలంగాణ విషయంలో అందరితో చర్చించి జాతీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణలో సెంటిమెంట్ తీవ్రంగా ఉందన్నారు. ఒత్తిళ్ల వల్ల ప్రయోజనం లేదన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని, గతంలో కూడా తాము ఇదే విషయం చెప్పామని ఆయన అన్నారు.
Comments