ఫిటెనెస్ కోసం మహేష్ కష్టాలు...!
మహేష్ బాబు తన బాడీ ఫిటెనెస్ కోసం పర్సనల్ గా ఫిజికల్ ట్రైనర్ ని నియమించుకున్నారుట. శరీరాన్ని క్రమ పద్దతిలో సన్నగా ఉంచటం చాలా కష్టమని, ఎప్పుడైనా రిలాక్స్ అయితే బరువు పెరిగిపోతున్నామని , అందుకే ఓ ట్రైనర్ ని పెట్టుకుని ఫిటెనెస్ ఎక్సరసైజులు చేస్తున్ననని చెప్పుకొచ్చాడు మహేష్. .ఎక్సరసైజులు ఇబ్బందిగా ఉన్నా ఎంజాయ్ చేస్తున్నాడట. ముఖ్యంగా ' దూకుడు ' చిత్రంలో మహేష్ ఓ పోలీస్ ఆపీసర్ గా కనిపించనున్నారు. ఆ పాత్ర ఫిట్ నెస్ కోసమె ఇలా ట్రైనర్ ని పెట్టుకుని మరీ మహేష్ కష్టపడుతున్నారని సమాచారం. కాగా, పూరీ జగన్నాథ్ చిత్రం ‘ది బిజినెస్ మేన్’ లో మహేష్ బాబుది డైనమిక్ రోల్ అంటున్నారు. సినిమా షూటింగుకి సంబంధించిన లొకేషన్లను పూరి ముంబైలో ఎంపిక చేస్తున్నారుట. కాజల్ కథానాయికగా నటించే ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఇది వచ్చే సంక్రాంతి సినిమా కావచ్చు.

Comments