మూడవ టెస్టు డ్రా: సిరీస్ భారత్ కైవసం
డొమినికా,జులై 11: భారత్-వెస్టిండీస్ మధ్య ఇక్కడ జరిగిన మూడవ టెస్టు డ్రా ముగిసింది. 180 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 94/3 వికెట్లు వద్ద ఉండగా ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో మొదటి టెస్టులో గెలిచిన భారత్ 1-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. విండీస్ గడ్డపై చాలా కాలం తరువాత రెండు టెస్టు మ్యాచ్‌లు గెలిచి విజయ దుందుభి మోగించాలనకున్న ధోని గ్యాంగ్ కు నిరాశే ఎదుదైంది. భారత్ ఓపెనర్ ముకుంద్ ఆరంభంలోనే డకౌట్‌గా వెనుదిరిగి భారత్ ఆశలపై నీళ్లు చల్లాడు. కాగా విజయ్ (45), రైనా (8) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. డ్రా సమయానికి ద్రవిడ్(34) , లక్ష్మణ్ (3) పరుగులతో నా టౌట్‌గా క్రీజ్‌లో నిలిచారు.
Comments