ఇక సంప్రదింపుల కమిటీ...!!
హైదరాబాద్,జులై 7: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై ఆ ప్రాంత పార్టీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తుండడంతో మరో కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారినీ ఏకాభిప్రాయానికి తెచ్చేలా సంప్రదింపులు జరిపే పేరుతో ఈ కమిటీని ఏర్పాటుచేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నుంచి ఇద్దరేసి చొప్పున ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని.. రాష్ట్రంలోని పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యులందరితో మాట్లాడి వారినందరినీ ఏకాభిప్రాయానికి తీసుకువచ్చేందుకు కమిటీ కృషిచేసేలా చూడాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. బహుశా ఈ సంప్రదింపుల కమిటీ ఏర్పాటు పై వారాంతంలోగా లేదంటే నెలాఖరుకు కానీ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.
Comments