రాజీనామాలు తప్పవా...?
న్యూఢిల్లీ,జులై 3: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులకు రాజీనామాలు చేసేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. వారు ఆదివారం రాత్రి కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డితో సమావేశమయ్యారు. సోమవారం సమర్పించనున్న రాజీనామాలపై వారు కేంద్ర మంత్రితో చర్చించినట్టు సమాచారం. ఇటు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డి హైదరాబాద్ లో మాట్లాడుతూ, రాజీనామాలపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. తెలంగాణ పాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులకు రేపు ఉదయం 11-12 గంటల మధ్య రాజీనామాలు చేయనున్నారని ఆయన చెప్పారు.
Comments