ఉపరాష్ట్రపతి రేసులో సుశీల్ కుమార్ షిండే
న్యూఢిల్లీ,జులై 10: వచ్చే ఏడాది జరుగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు తాను రేసులో వున్నానని కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. అందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధి ఆశీస్సులున్నాయని షిండే అన్నారు. దళిత వర్గానికి చెందిన షిండే... గాంధీ, నెహ్రూ కుటుంబాలకు అత్యంత విధేయుడు. గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా కూడా షిండే సేవలందించారు.
Comments