ముంబై,డిసెంబర్ 18: వచ్చే ఏడాది ఉపఖండంలో జరిగే ప్రపంచకప్ కోసం భారత ప్రాబబుల్స్ ను సెలక్టర్లు ప్రకటించారు. 30 మంది సభ్యుల బృందంలో పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌కు చోటు దక్కలేదు. యూసుఫ్ పఠాన్‌తో పాటు అజింక్యా రహానే, చటేశ్వర పుజారాలకు స్థానం లభించింది. జనవరిలో ఈ జాబితాను 15 మందికి కుదిస్తారు. 13 మంది బ్యాట్స్‌మెన్, ఏడుగురు పేస్ బౌలర్లు, ఆరుగురు స్పిన్నర్లతో పాటు నలుగురు వికెట్ కీపర్లను ఎంపిక చేశారు. ప్రాబబుల్స్ జాబితా: ధోని, సెహ్వాగ్, సచిన్, గంభీర్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, విజయ్, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, సౌరభ్ తివారీ, యూసుఫ్ పఠాన్, శిఖర్ ధావన్, చటేశ్వర్ పుజారా, జహీర్ ఖాన్, నెహ్రా, శ్రీశాంత్, మునాఫ్, ఇషాంత్, వినయ్ కుమార్, ప్రవీణ్, హర్భజన్, అశ్విన్, అమిత్ మిశ్రా, పీయూష్ చావ్లా, రవీంద్ర జడేజా, ప్రజ్ఞాన్ ఓజా, వృద్ధిమాన్ సాహా, దినేశ్ కార్తీక్, పార్థీవ్ పటేల్.