
హైదరాబాద్,డిసెంబర్ 14: జగన్ వెంట పరుగెడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యేలను సముదాయించడం పెద్ద తలనొప్పిగా మారింది. బందరు ఎమ్మెల్యే పేర్ని నానీని ఏదో విధంగా బుజ్జగించి తమ దారిలోకి తెచ్చుకునేలోపు తూర్పుగోదావరి నుంచి అనపర్తి ఎమ్మెల్యే శేషారెడ్డి తయారయ్యారు. కార్యకర్తల అభీష్టం మేరకు తాను వైఎస్ జగన్ యాత్రలో పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని వద్దని చెప్పినా... వెళ్లకుండా ఉండటం తన వల్ల కాదని శేషారెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదిలావుంటే ఇంకా తూర్పుగోదావరిలో జగన్ వెంట నడిచే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఆది నుంచి జగన్ కుడిభుజంలా ఉంటూ మంత్రి పదవిని సైతం వద్దని చెప్పిన మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్యనాయకులతో కీలక మంతనాలు సాగిస్తున్నారు.
Comments