వీడియోలో ఉన్నది నేను కాదు: రంజిత
చెన్నై,డిసెంబర్ 31: ‘నిత్యానంద స్వామి రాసలీల’ వీడియోలో ఉన్నది తాను కాదని సినీనటి రంజిత స్పష్టం చేశారు. ఆ వీడియోలో తాను ఉన్నట్లు ప్రచారం చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు నిత్యానంద స్వామితో సెక్సు స్కాండల్ ఇరుక్కుపోయిన సినీ హీరోయిన్ రంజిత చాలా రోజుల తర్వాత శుక్రవారం మీడియా ముందుకు వచ్చింది. తనను చంపుతానని ఇన్నాళ్లు కొందరు బెదిరించినందువల్లే ఇన్ని రోజులు బయటకు రాలేక పోయాలని ఆమె తెలిపింది. నిత్యానంద గొప్ప మహర్షి అని, తాను ఆయన శిష్యురాలిని అని చెప్పారు.

Comments