భారతీయ సైన్స్ జర్నలిస్టుకు అంతర్జాతీయ అవార్డు
వాషింగ్టన్,డిసెంబర్ 17: భారత సీనియర్ పాత్రికేయుడు పల్లవ బాగ్లా ఈ ఏడాదికిగాను సైన్స్ జర్నలిజంలో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డు ‘డేవిడ్ పెర్ల్‌మన్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ సైన్స్ జర్నలిజం’ను అందుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో గురువారం జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును స్వీకరించారు. ‘ హిమనీనదాలపై వాతావరణ మార్పుల ప్రభావం’అన్న అంశంపై రాసిన వ్యాసాలకుగాను ఆయన ‘న్యూస్’ విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
Comments