రోడ్డు ప్రమాదాలలో 14 మంది మృతి
హైదరాబాద్,డిసెంబర్ 15: రాష్ట్రంలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో 14 మంది మరణించారు. ఖమ్మం జిల్లా అశ్వాపురంవద్ద లారీ-ఆటో ఢీకొన్న దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు. కర్నూలు జిల్లాలోని ఆలూరు మండలం కరువల్లి సమీపంలో బస్సు-ఆటో ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ పటమట జేడీ టవర్స్ వద్ద లారీ- ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్ అల్కాపురి కూడలి వద్ద లారీ కిందపడి నాలుగో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.
Comments