బాబు దీక్ష భగ్నం: టీడీపీ బంద్
హైదరాబాద్,డిసెంబర్ 20: : రైతు సమస్యలపై మూడు రోజుల క్రితం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టినదీక్షను పోలీసులు భగ్నం చేసి చికిత్స నిమిత్తం నింస్ కు తరలించారు. చంద్రబాబునాయుడు నింస్ లో తన దీక్షను కొనసాగిస్తున్నారు. చంద్రబాబుపై నాన్‌బెయిల్ కేసు నమోదు చేశారు. కాగా చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ రాష్టవ్య్రాప్తంగా తెదేపా కార్యకర్తలు నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలకు దిగారు. రైతాంగ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చేవరకూ దీక్ష విరమించేది లేదని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.చంద్రబాబునాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ ఆపార్టీ సోమవారం నాడు రాష్టవ్య్రాప్త బంద్‌కు పిలుపు నిచ్చింది. పలు జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు దుకాణాలు, విద్యాసంస్థలను మూసివేయించారు.

Comments