సెంచూరియన్ లో ఓడిన భారత్...
సెంచూరియన్,డిసెంబర్ 20: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. రెండో ఇన్నింగ్స్ లో 459 పరుగులకు భారత్ ఆలౌటయింది. 50వ టెస్ట్ సెంచరీ సాధించిన సచిన్ 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్ 4 వికెట్లు పడగొట్టాడు. మోర్కల్, హారీస్ రెండేసి వికెట్లు తీశారు. టసట్‌సోబ్, కల్లిస్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 136 పరుగులు చేయగా దక్షిణాఫ్రికా 620/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
Comments