ఎన్.ఆర్.ఐ.ల కోసం కొత్త ఛానెల్
వాషింగ్టన్,డిసెంబర్ 20: ఉత్తర అమెరికాలోని ప్రవాస భారతీయులకు వినోదం పంచేందుకు మరో కొత్త ఛానెల్ ఆవిర్భవించింది. ఐపీ టీవీ గ్రూప్ ప్రవాస భారతీయులకు ప్రత్యేకించి ‘డేటా బజార్’ పేరుతో నూతన నెట్ ఛానెల్‌ను ప్రారంభించింది. నిన్న, నేటి తరాలకు వేదికగా డేటా ఛానెల్ ప్రసారాలు భారతీయులను ఆకట్టుకుంటాయని ఛానెల్ ప్రారంభోత్సవం సందర్భంగా డేటాబజార్ వ్యవస్థాపకులు, సీఈఓ ఒనీ సీల్ వెల్లడించారు. ఉత్తర అమెరికా వ్యాప్తంగా వందకు పైగా వున్న ఐపీ గ్రూప్ ఛానల్స్‌కు 1.2 బిలియన్ల ప్రేక్షకులున్నారు. కేవలం 59.99 డాలర్లు చెల్లించి ఐపీ గ్రూప్ ఛానెల్ ప్రసారాలు పొందవచ్చని తెలిపారు. డేటా బజార్‌లో భారతీయ చిత్రాలు, సంప్రదాయ కార్యక్రామలు ప్రసారం చేస్తామన్నారు.
Comments