వచ్చేవారమే 'రగడ '
హైదరాబాద్: కింగ్ నాగార్జున హీరోగా కామాక్షి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై అగ్ర నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి యువదర్శకుడు వీరు పోట్ల దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం రగడ డిసెంబరు 23న విడుదలకు సిద్ధమైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'రగడ' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబరు 23నే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఎంతో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నామని నిర్మాత శివప్రసాద్ రెడ్డి తెలిపార్. ప్రేక్షకులు, అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్టుగా డైరెక్టర్ వీరు పోట్ల ఈ చిత్రాన్ని రూపొందించారని, నాగార్జున తో ' కామాక్షి ' బ్యానర్లో చేసిన ఈ చిత్రం మరో సన్సేషనల్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మాత. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు అనుష్క, ప్రియమణి, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటించారు.

Comments