మే 8 తేదిన ఎంసెట్
హైదరాబాద్,డిసెంబర్ 30: : రాష్ర్టంలో జరిగే ప్రవేశ పరీక్షల తేదిలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. మే 8 తేదిన ఎంసెట్, మే 15 ఐసెట్‌ను, జూన్ 4 ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రవేశ పరీక్ష జరిగిన 15 రోజుల లోపే ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. జంబ్లింగ్ లేకుండానే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments