పౌరహక్కుల నేత కణ్ణబీరన్ కన్నుమూత
హైదరాబాద్,డిసెంబర్ 30: : సీనియర్ న్యాయవాది, పౌరహక్కుల నేత కణ్ణబీరన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతూ గురువారం సాయంత్రం మారేడ్‌పల్లిలోని ఆయన స్వగృహంలో మరణించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా హక్కుల రంగంలో కృషి చేస్తున్నారు. నక్సలైట్ల మీద పెట్టిన కేసుల్ని హైకోర్టులోను, పై కోర్టుల్లోను వాదించారు. బూటకపు ఎన్‌కౌంటర్ల గుట్టురట్టు చేయడంలో ఆయన ముందుండేవారు. అయన భార్య వసంత, కూతురు కల్పన సాంస్కృతిక రంగంలో సేవలందిస్తున్నారు.
,
,
Comments