రెండో టెస్టులో భారత్ గెలుపు
దర్బన్,డిసెంబర్ 29: రెండో టెస్టులో భారత్ 87 పరుగుల తేడాతో విజయం సాధించిఇంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. ఆఖరి మ్యాచ్ ఆదివారం నుంచి కేప్‌టౌన్‌లో జరుగుతుంది.303 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా... నాలుగో రోజు బుధవారం రెండో ఇన్నింగ్స్‌లో 72.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ కలిస్ (52 బంతుల్లో 17; 2 ఫోర్లు), డివిలియర్స్ (76 బంతుల్లో 33; 1 సిక్సర్) అవుట్ అయ్యారు. మొత్తం రెండు ఇన్నింగ్స్‌లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచిన హైదరాబాదీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Comments