
హైదరాబాద్,డిసెంబే 24: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి తన దీక్షను విరమించారు. ఢిల్లీ నుంచి తొమ్మిది పార్టీలకు చెందిన నేతలు శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని నిమ్స్‌లో బాబుతో కొద్దిసేపు చర్చలు జరిపారు. రైతుల తరఫున చేస్తున్న ఈ పోరాటానికి తాము అండగా ఉంటామని, దీక్ష విరమించాలని వారు కోరటంతో ఆయన అంగీకరించారు. దీంతో ఆయా పార్టీల నేతలు చంద్రబాబుకు ఉమ్మడిగా కొబ్బరి నీళ్లు తాగించి దీక్ష విరమింపచేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన వారిలో శరద్‌యాదవ్ (జేడీయూ), ఏబీ బర్దన్(సీపీఐ), ప్రకాశ్ కారత్(సీపీఎం), అజిత్‌సింగ్(ఆర్‌ఎల్‌డీ), ఓం ప్రకాష్ చౌతాలా(ఐన్‌ఎల్‌డీ), అరుణ్‌కుమార్ శర్మ(ఏజీపీ), దిషాన్ ఆ లీ (జేడీఎస్) ఉన్నారు. తంబిదురై(ఏఐఏడీఎంకే), వై.గోపాలస్వామి(ఎండీఎంకే) చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు.
Comments