కాంగ్రెస్ కు జక్కంపూడి రాజినామా...
హైదరాబాద్,డిసెంబర్ 15: తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామమోహనరావు పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఆయన భార్య, ఎఐసిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కూడా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి మాట్లాడుతూ, పార్టీతో తనకు ఉన్న 30 ఏళ్ల అనుబంధం తెగిపోయిందని అన్నారు. తామంతా జగన్మోహన రెడ్డికి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. మాజీ ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి పర్యటనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కడియం సెంటర్లో జరిగిన సభలో వారు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా జగన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
Comments