Sunday, December 26, 2010
ఢిల్లీలో దట్టమైన పొగమంచు
న్యూఢిల్లీ,డిసెంబర్ 26: దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు వంద వరకు స్థానిక, అంతర్జాతీయ విమానాలకు అవరోధం కలిగింది. కొన్నింటిని రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇంకొన్ని విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు కారణంగా రన్‌వే విజిబిలిటీ వంద మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. దీంతో 14 అంతర్జాతీయ విమానాలు సహా 42 విమానాలను హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, లక్నోలకు మళ్లించారు. దీనితో అధికారులు విజిబిలిటీ పరిమితిని పెద్ద విమానాలకు 175 మీటర్ల నుంచి 150 మీటర్లకు, చిన్న విమానాలకు 150 నుంచి 125 కి.మీ.కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలావుండగా, ఢిల్లీలో వర్షంలాగా మంచు కురుస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment