ధోనీ సేన ముందు భారీ సవాల్...
సెంచూరియన్,డిసెంబర్ 18: : భారత్‌తో టెస్టు మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా రికార్డుల కోసం ఉపయోగించుకుంటోంది. తొలి ఇన్నింగ్స్ ను 4 వికెట్ల నష్టానికి 620 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.కెరీర్‌లో 38 సెంచరీలు చేసిన కలిస్ డబుల్ సెంచరీ చేశాడు. డివిలియర్స్ ఏకంగా తమ దేశ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో భారత్ 2 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్లు సెహ్వాగ్ 63 , గంభీర్ 80 పరుగులు చేశారు. ఆట ముగిసే సమయానికి ద్రవిడ్ 28, ఇషాంత్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్టెయిన్, హారిస్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
Comments