భారీగా పెరగనున్న వంట గ్యాస్ ధర
న్యూఢిల్లీ,డిసెంబర్ 20: వంటగ్యాస్ ధరను భారీగా పెంచడానికి కసరత్తు జరుగుతున్నది. గ్యాస్ సిలిండర్ పెంపు ధ రూ. 50 నుంచి రూ. 100 వరకూ ఉండవచ్చని అంచనా. ఆగస్టు నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌పీజీ ధరలు దాదాపు 66 శాతం పెరిగాయని, దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలపై పెనుభారం పడిందని ప్రభుత్వం చెబుతున్నది. చమురు సంస్థలు ఏటా దాదాపు 30 లక్షల టన్నుల ఎల్‌పీజీని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. వంటగ్యాస్ ధర పెంపుపై కేంద్రప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకోనుంది.
Comments