కాంగ్రెస్ కు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల రాజీనామా
హైదరాబాద్,డిసెంబర్ 22: జగన్ కు మద్దతుగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి వెంకటరావు, ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్‌కు మద్దతు ప్రకటించారు. బుధవారం గజపతి నగరంలో వెంకటరావు విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ ఏర్పాటు చేసే పార్టీ కోసం తాము పనిచేస్తామని తెలిపారు.
Comments