హైదరాబాద్,సెప్టెంబర్ 6: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 48,690 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు ప్రాథమిక సర్వేలో తేలిందని వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఎక్కువగా వరి పంట 39,915 ఎకరాల్లో, పత్తి 8,250 ఎకరాల్లో నీట మునిగిందని చెప్పారు. 235 ఎకరాల్లో మొక్కజొన్న, 290 ఎకరాల్లో సోయాబీన్ పంటలకు నష్టం వాటిల్లింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 25,262 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 12,560 ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 3,012 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 4,357 ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 2,490 ఎకరాలు , నిజామాబాద్ జిల్లాలో 1,182 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 200 ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయన్నారు. ప్రాజెక్టులకు జలకళ.... ఇలాఉండగా, భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో రాష్ట్ర ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. జూరాల, శ్రీశైలం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ధాటికి ప్రియదర్శిని జూరాల పూర్తిగా నిండింది. ఎగువనున్న ఆలమట్టి, నారాయణపూర్ నిండటంతో ప్రాజెక్టుకు ఏకంగా 1.53 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దాంతో 19 గేట్లను రెండు మీటర్ల దాకా ...