సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అల్త్ మస్ కబీర్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అల్త్ మస్ కబీర్ నియమితులయ్యారు. ఎస్ హెచ్ కపాడియా స్థానంలో ఈనెల 29న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2005, మార్చి 1 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కబీర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1948, జూలై 19న కోల్‌కతాలో జన్మించిన కబీర్ కోల్‌కతా యూనివర్సిటీ నుంచి ఆయన ఎల్‌ఎల్‌బీ, ఎమ్ఏ పూర్తి చేశారు. 1990, ఆగస్టు 6న కోల్‌కతా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Comments