గెలిపించిన కోహ్లీ
కొలంబో,సెప్టెంబర్ 30: ప్రపంచ కప్ ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.4 ఓవర్లకు 128 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన భారత్ 17 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 129 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించింది. కోహ్లీ 78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సెహ్వాగ్ 29 పరుగులు చేశాడు. రజా హసన్, షాహిద్ అఫ్రిది చెరో వికెట్ తీసుకున్నారు.
Comments