క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ మృతి
ఆనంద్(గుజరాత్),సెప్టెంబర్ 9: క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ (91) కన్నుమూశారు. దీర్ఘ కాలంగా అనారోగ్యంతోఉన్న ఆయన నడియాడ్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాల ఉత్పత్తి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి క్షీర విప్లవ పితామహుడిగా కురియన్ ఖ్యాతి కెక్కారు. గుజరాత్ పాల సహకార సంఘం మార్కెటింగ్ ఫెడరేషన్ స్థాపించి పాల ఉత్పత్తి రంగంలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. అమూల్ పాల ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడానికి కురియన్ చేసిన కృషి ఎంతో ఉంది. జాతీయ డైయిరీ బోర్డు చైర్మన్ గా ఆయన విశేష సేవలందించారు. 1999లో భారత ప్రభుత్వం కురియన్ ను పద్మవిభూషణ్ తో గౌరవించింది.

Comments