ప్రాక్టీస్ మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం
కొలంబో,సెప్టెంబర్ 17: ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన ట్వంటీ20 ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ జట్టుపై పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. తొలుత భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 19.1 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 186 పరుగులు చేసింది. అక్మల్ 50 బంతులకు 6 సిక్సర్లు, 5 ఫోర్లతో 92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
Comments