ట్వంటీ 20 ప్రపంచకప్‌లో శ్రీలంక బోణీ...
హాంబన్‌టోటా,సెప్టెంబర్ 18: ట్వంటీ 20 ప్రపంచకప్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి ట్వంటీ 20 మ్యాచ్‌లో శ్రీలంక జింబాంబ్వే పై 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అజంతా మెండిస్ ఆరు వికెట్లు, జీవన్ మెండిస్ మూడు వికెట్లు నేలకూల్చి శ్రీలంక కు పరిపూర్ణమైన విజయాన్నందించారు. శ్రీలంక నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే ఆదిలోనే తడబడి వరుస వికెట్లు కోల్పోయి ఓటమి చవిచూసింది.
Comments